భారతీయ జనతాపార్టీ అగ్రనేత, దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనారోగ్య కారణాలతో రిటైర్‌మెంట్‌ దశకు చేరుకున్నా కూడా ఆయనను పార్టీ వదలడం లేదు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనచేత ప్రచారం చేయించేందుకు ఉత్సుకత చూపిస్తోంది. అక్టోబర్‌‍లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపును ప్రచారం చేయనున్న 40 మంది ప్రముఖుల జాబితాలో వాజ్‌పేయి పేరును కూడా చేర్చింది. పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఈ జాబితాలో ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌, మురళీ మనోహర్‌ జోషి, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో పాటు వాజ్‌పేయి పేరు కూడా చేర్చింది. ఇదిలావుండగా ఇటీవల ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్‌ గాంధీని ప్రశంసించడం ద్వారా పార్టీలో కలకలం రేపిన బాలీవుడ్ నటుడు, లోక్‌సభ సభ్యుడు,శత్రుఘ్న సిన్హాల పేరు ప్రచారకుల జాబితాలో ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర నాయకులు గోపీనాధ్‌ ముండే, ప్రకాష్‌ జావెద్కర్‌లు ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి


Posted by Hollywood Actors
కాంగ్రెస్ అసలు సీనియర్లు వారి రాజకీయం బయటపడితోంది ఒకరి తరువాత ఒకరు జగన్ ని సం యమనం పాటించాలి అతనికి భవిష్యత్తు ఉంది ఇంకా ఇంతకంటే పెద్ద పదవులు చేస్తాడు మేమందరం అతనికి సపొర్ట్ ఇస్తాం అని తియ్యని పలుకులు పలుకుతు లోలోన రాజకీయం అనుభవాలు బయటపెడుతున్నారు చెప్పుకొకూడదు కాని కొంతమంది వై.యస్.పై ఉన్న కోపాన్ని చూపిస్తున్నారు నిన్న కెక్ సొనియా పోస్టర్ చించినందుకు రెచ్చిపోవడం హనుమంత రావు 48గంటలు మౌనవ్రతం చేస్తాననడం ఇవన్ని చెప్పకనే చెపుతున్నాయ్ నెమ్మ నెమ్మదిగా అందరిని వారి వైపు తిప్పిఉకొని జన అభిష్ఠాన్ని మరుగునకు తోతున్నారు సొనీయా రాజకీయ నాటకం ఆడుతు నెట్టుకొస్తోంది బానే తోసుకొచ్చింది వై.యస్.చనిపోవటంతో సినియర్ లు రెచ్చిపోతున్నారు వై.యస్.సినియార్లకి రిటైర్మెంట్ ఎందుకిస్తానంటాడో ఇప్పుడు అర్దం మవుతోంది


Posted by Hollywood Actors
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆగడం లేదు. తాజాగా భారత టాక్సీ డ్రైవర్ పై ఆస్ట్రేలియా ఫుట్ బాల్ క్రీడాకారుడు దాడి చేశాడు. ఎస్సెండెన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు మైఖెల్ హర్లీ హాడిల్ స్ట్రీట్ లోని ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ వద్ద భారత టాక్సీ డ్రైవర్ పై దాడి చేశాడు. దీంతో హర్లీని పోలీసులు అరెస్టు చేశారు. హర్లీ ఉదయం ఐదున్నర గంటలకు నైట్ క్లబ్ కు టాక్సీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫుడ్ అవుట్ లెట్ కు వెళ్లాడు. అతను ఆహారం కోసం టాక్సీ దిగాడు. దీంతో టాక్సీ డ్రైవర్ కిరాయి అడిగాడు. దీంతో హర్లీ ఆ టాక్సీ డ్రైవర్ పై దాడి చేశాడు.

హర్లీని సంఘటనా స్థలంలోనే పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ఫిజ్రోయ్ పోలీసు స్టేషన్ కు తీసికెళ్లారు. ఆ తర్వాత అతన్ని పోలీసులు విడుదల చేశారు. హర్లీపై కేసు నమోదు చేయవచ్చునని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తను రాసిన పత్రిక టాక్సీ డ్రైవర్ ను గుర్తించలేదు. అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలిపింది. మైఖెల్ ఆలస్యంగా రావడం, తనను తాను ఇబ్బందుల్లో కూరుకుపోవడం అసంతృప్తికి గురి చేసిందని ఎస్సెండెన్ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ జాక్సన్ వ్యాఖ్యానించారు.




Posted by Hollywood Actors
భారత్ తొలిసారి చంద్రుడిపైకి పంపిన అంతరిక్ష నౌక (చంద్రయాన్- 1) అక్కడ నీటి జాడలు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) గురువారం ప్రకటించింది. చందమామపై నీటి జాడలు గుర్తించడం వెనుక ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) కృషిని విస్మరించలేమని నాసా శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చంద్రయాన్- 1లో జాబిలిపైకి వెళ్లిన 11 పరికరాల్లో నాసా రూపొందించిన మూన్ మినిరాలజీ మ్యాపర్ (ఎం3) కూడా ఉంది. ఈ ఎం3 పంపిన వివరాలను అమెరికాలోని మూడు బృందాలు విశ్లేషించాయి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో జాబిలిపై నీరు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు ఉన్న చంద్రుడి ఉపరితలం పొడిగా ఉంటుందనే భావన పటాపంచలైంది.

చంద్రుడి ఉపరితలంపై నీటి ఉనికికి సంబంధించిన స్పష్టమైన రసాయన ఆనవాళ్లు కనిపించాయి. చంద్రుడిపై నీటి జాడలు గుర్తించడంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ ఎంత పరిమాణంలో నీరుందో తెలుసుకోవడంపై దృష్టిసారించనున్నారు. చంద్రయాన్- 1 సాధించిన ఫలితాలతో విశ్వంలో జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

ఇస్రో చరిత్రలో చంద్రయాన్- 1 గొప్ప ముందడుగని భారత శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి వెలుపల మరో ప్రాంతంలో నీటి జాడలు స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారి. చంద్రయాన్- 1 సాధించిన ఈ ఘనతపై ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్- 1లో మొత్తం 11 పరికారాలు ఉన్నాయని, ఇవన్నీ పంపిన సమాచారాన్ని విశ్లేషిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెలియవచ్చని చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రయాన్- 1 ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై మా బేబి విజయాన్ని సాధించిందన్నారు. వాస్తవానికి 40 ఏళ్ల క్రితమే చందమామపై అమెరికా శాస్త్రవేత్తలు నీటి జాడలు ఉన్నట్లు చెప్పారు. అపోలో యాత్రల సందర్భంగా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికా వ్యోమగాములు భూమికి తెచ్చిన జాబిలి శిలల్లో నీటి ఆనవాళ్లు గుర్తించారు.

అయితే భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ శిలలు ఉంచిన పెట్టెలు ప్రమాదవశాత్తూ తెరుచుకున్నాయి. దీంతో వీటిపై గుర్తించిన నీటి జాడలు భూవాతావరణంలోనే ఏర్పడి ఉంటాయని అనుమానాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలను చంద్రయాన్- 1 పంపిన సమాచారంతో పటాపంచలయ్యాయి.

ప్రపంచం చాలా కాలం నుంచి విశ్వంలో జీవం కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జీవుల మనుగడకు అత్యంత కీలకమైన నీటిని అన్వేషించడంపై గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తాజా ఫలితాలతో నీటి ఆనవాళ్లు తెలుసుకునేందుకు జాబిలిపై మరిన్ని దేశాలు దృష్టిసారించే అవకాశం ఉంది.

Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates