ప్రొద్దున్నే బిబిసి చూస్తుంటే అనిల్‌కపూర్ దర్శనం ఇచ్చాడు. లండన్‌లో జరిగే BAFTA వేడుకలలో పాల్గొనడానికి వచ్చాడట. ఆయన నటించిన స్లండాగ్ మిలియనీయర్ ఈసారి BAFTA వేడుకలలో ప్రత్యేక ఆకర్షన కావడంతో ఆ సినిమా గురుంచి మాట్లాడడానికి ఆయనను స్టుడియోకు పిలిచారు. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే, మొదట ఈ సినిమాకు అండర్‌డాగ్ (underdog) మిలియనీయర్ అని పేరు పెడదామనుకున్నారట కానీ ఆపేరు సినిమా కథనానికి తగ్గట్టుగా లేదని "స్లండాగ్" అనే ఒక కొత్త పదాన్ని పుట్టించి స్లండాగ్ మిలియనీయర్ అని పేరు పెట్టారట (there is no word as slumdog in english dictionary). ఈరోజుల్లో పేరుకున్న ప్రాముఖ్యత అలాంటిది మరి. టాటా ఉప్పు కాని బాటా చెప్పు కాని, పేరుతోనే అమ్ముడుపోయేది. అలాంటిది, అసలే ముంబాయి మురికివాడ స్టోరీ, పేరులో ఈమాత్రం కంపు లేకపోతే చుసేవాళ్లకు ఇంపుగా ఎలాఉంటుంది.
ఇండియా గురించి మనం విదేశీయులకు చూపించినా, వాళ్లు మనకు చూపించినా ప్రతీసారీ వీళ్లు చూపించే క్లిప్పింగ్స్ ఏమిటంటే...
కిక్కిరిసిన రోడ్లు, బిచ్చగాల్లు, రోడ్ల మీద తిరిగే ఆవులు, బర్రెలు, ఒల్లంతా విభూది పూసుకున్న సన్నాసులు, దేవుడి ఫొటోలు, రోడ్డుపక్కన పాములాడించేవారు, మురికివాడలు, అందులో ఉండే ముక్కు కారుతున్న పిల్లలు.
ఇప్పుడొచ్చిన ఈ సినిమా అందుకు మినహాయింపేమికాదు, అక్కాడక్కడ రోతపుట్టించే సన్నివేశాలతో, ముంబాయి మురికి వాడల్ని గ్లోరిఫై చేస్తూ సినిమా బాగనే తీసారు... సంతోషం... అదే చేత్తో ఇండియా గొప్పతనాన్ని కూడా గ్లోరిఫై చేస్తూ సినిమా తీసి దాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శిస్తే ఇంకా చాలా సంతోషించే వాన్ని.
ఇక ఈ సినిమా విజయం వెనుకున్న రహస్యం ఎమిటంటే, ఈసినిమా చూసిన ప్రతివారికీ ఎవరయినా మిలియనీయర్ కావచ్చు అనే ఫీలింగ్ వస్తుందట. ఇప్పుడున్న ఆర్థిక గడ్డుకాలంలో ఇది అందరికి మోటివేషన్ ఇస్తుందట అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందట, ఇది నిన్న రాత్రి రెడ్ కార్పెట్ పైన ఈ సినిమా హీరోయిన్ Freida Pinto బిబిసి వాళ్ల మైకుముందు మైకంలో చెప్పిన మాటలు.
ఏమో ఎంత మందికి ఆ ఫీలింగ్ వచ్చిందో తెలియదు కాని నాకు మాత్రం రాలేదు.
ఇక నిన్న BAFTA అవార్డుల విషయానికి వస్తే, చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు, ఈ మురికి కుక్క పేరుచెప్పి ఏడు (ఏ. ఆర్. రహమాన్‌ను మినహాయిస్తే, ఆరు) అవార్డులు తెల్లదొరలు చంకలో పెట్టుకొని వెళ్లారు.
మహా భారతంలో ధర్మరాజు స్వర్గానికి వెళ్లడానికి దారి తెలియక కుక్క వెంట వెళ్లవలసి వచ్చిందట. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ ఇప్పుడు ఈ మురికి కుక్కను వెంటబెట్టుకొని తెల్లదొరలు ఆస్కార్ అవార్డ్ వరకూ వెళ్లేట్లు ఉన్నారు.
Tuesday, February 10, 2009
at
2:24 AM
|
Posted by
Hollywood Actors
0 comments:
Post a Comment