స్లండాగ్ మిలియనీర్ కి 10 ఆస్కార్ నామినెషన్లు రాగానె మన "శంకరభరణానికొ, షొలె "కొ వచ్చినట్టు ఎగిరి గంతెశాం కాని దాని వెనక ఉన్న కార్పొరెట్ మాయని కూడా గ్రహించాలి ఇన్నాళ్ళు భారతీయ సినిమాలని సాంకెతిక నిపుణులని తక్కువగా చూసిన హలివుడ్ ఒక్కసారిగా ఇంత ప్రెమ కురిపించానికి కారణం దాని వెనకున్న కర్పొరెట్ దిగ్గజాల వ్యాపార ప్రయొజనాలె భారతీయ మీడియ ప్రపంచం లొనె అతిపెద్దదిగా ఎదుగుతొంది క్రికెట్ ప్రసార హక్కులు 4000 కొట్లు దాటుతున్నై హలివుడ్ చిత్రాలని చూడటమె తప్ప అవార్డుల గురించి అంతగా పట్టించు కొని మన మీడియకి మనకి ఆసక్తి కలిగించి మన ప్రసార సాదనాల మార్కెట్ లొని కొట్లను కొల్లగొట్టడనికి వెసిన ఒక ఎత్తుగడ ఇప్పటికె స్లండాగ్ పుణ్యమా అని ఉపఖండం ఆస్కార్ ప్రసార హక్కులు 100 కొట్లు దాటెశాయి మొన్నటిదాక సౌందర్య సాదనాల బిజినెస్ కొసం మిస్ వరల్డ్ లు ఇప్పుడు గొల్డెన్ గ్లొబ్ , ఆస్కార్లు ఈఅవార్డులు రావడం భాదకరం అనట్లెదు అంత ప్రెమ ఇప్పుడె ఎందుకు వచ్చింది రాజ్ కపూర్ ,NTR, ANR లు బెస్ట్ యాక్టర్లు కాదా ? వారిది లైఫ్ టైం అచివ్మెంట్
కాద ? ఒకసారి అలొచించండి

Posted by Hollywood Actors

1 comments:

కన్నగాడు said...

అయ్యా ఇదే రకం టపానొకదానిని జీడిపప్పు గారు ప్రచురించారు స్లమ్ డాగ్ కి ఇన్ని అవార్డులెందుకు అనే శీర్షికన.
అక్కడ కూడ ఇలాంటి సమాధనమే రాసా.
మీరన్నట్టు రాజకీయాలు చేసి నామినేషన్లైతే తెచ్చుకోగలం లేదా మహా అయితే ఒకటి అరా బహుమతులు సంపాదించవచ్చు అంతే కాని ప్రతి వేడుకలో బహుమతులన్ని ఊడ్చితెచ్చుకోవడం సాధ్యంకాని విషయం. దీనికి మంచి ఉదాహరణ బెంజిమన్ బట్టన్ ఈ చిత్రానికి పదమూడు నామినేషన్లతో ఆస్కార్ రేసులో అత్యధిక నామినేషన్లతో ముందుంది. కాని మరే వేడుకలోనైనా నామినేషన్లు కూడా సరిగా రాలేదు ఇక ఆవార్డులైతే ఆస్కార్ నామినేషన్లకంటే తక్కువగా పన్నెండు మాత్రమే, అదే సమయంలో స్లమ్ డాగ్ యాభై ఎనిమిది బహుమతులు గెలుచుకుంది. (నిజానికి బెంజిమిన్ సినిమా కూడా విషయం లేని సినిమానే) కాబట్టి సరకు లేకుండా అవార్డులు ఇన్ని అవార్డులు రావు.(మరిన్ని అవార్డుల వివరాలకై ఐఎమ్‌డిబి వెబ్సైట్ చూడండి.)
ఇక ఇప్పుడే ఈ సినిమాకే భారతీయ సినిమా గుర్తొచ్చిందా అంటే నా సమాధానం ఇప్పటికీ గుర్తు రాలేదు ఇకముందు కూడా గుర్తు రాదు. ఎందుకంటే స్లమ్‌డాగ్ భారతీయ(బాలీవుడ్) సినిమా కాదు, భారతీయ నేపథ్యంలో వచ్చిన ఆంగ్ల(హాలీవుడ్) చిత్రం. ఆస్కార్ అనేది అంగ్లచిత్రాలకు మాత్రమే ఇచ్చే అవార్డులు. రాజ్ కపూర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఎంత గొప్ప వాళ్లైనా వాళ్లు బహుమతులివ్వలేరు. అంతెందుకు టామ్‌హ్యాంక్స్, అల్ పచినో లకు మన జాతీయ బహుమతులు ఎన్ని సార్లు ఇచ్చాం అంటే ఏం చెబుతాం. మనం ఇవ్వలేం, మనం ఇవ్వలేనంత మాత్రాన వాళ్ళు గొప్పనటులు కాకపోరు మంచి సినిమాలు తీయకపోరు.
ఆస్కార్ లో మన సినిమాకు బహుమతి గెలుచుహుకోగలిగే విభాగం కేవలం ఒకటే అది ఉత్తమ విదేశీ చిత్రం, ఈ విభాగానికి పంపే చిత్రాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కమిటీ ఎన్నుకుంటుంది సగం సార్లు అర్హత లేని చిత్రాలే ఎన్నికవుతాయి మీరు చెప్పినట్లు బిజినెస్ మాయతో.
అంతే కాని స్లమ్‌డాగ్ చిత్రంలో విషయం లేదనటం నిజంకాదు, ఈ సినిమా గురించి అంగ్లేయుల అభిప్రాయం అడిగినప్పుడు చాలామంది ఆస్కార్ వస్తుందని నమ్మకంతో చెప్పారు.

February 14, 2009 at 11:54 AM  
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates