Friday, September 11, 2009
at
11:59 AM
|
భారత్ గగనతలం, అంతర్జాతీయ సరిహద్దును చైనా మిలిటరీ ఉల్లంఘించినట్లు ఇటీవల భారత మీడియాలో జరిగిన ప్రచారంపై చైనా ప్రభుత్వ నడుపుతున్న ఓ ప్రధాన పత్రిక నిప్పులు చెరిగింది. ఆ పత్రిక గురువారం ప్రచురించిన ఓ కథనంలో భారత మీడియాను లక్ష్యంగా చేసుకుంది. ఇరుదేశాల మధ్య భారత మీడియా యుద్ధ కాంక్షను రెచ్చగొడుతోందని ఆరోపించింది. యుద్ధానికి సంబంధించిన వాక్పటిమ, ఇరుదేశాల మధ్య శతృత్వానికి బీజాలు వేసే చర్యల ద్వారా సినో- ఇండియా సంబంధాలను నిర్వీర్యపరుస్తోందని దుయ్యబట్టింది. భారత మీడియాను రోజూ పరిశీలిస్తుంటే... ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదనే ఆలోచన వస్తుందని చైనా డైలీ పత్రిక తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. గత కొన్ని నెలలుగా భారత మీడియా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయపడింది. వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం, సమాచారం తెలియజేయడం, స్ఫూర్తిని రగిలించడం వంటి చర్యలను మానుకొని భారత మీడియా యుద్ధ వాక్పటిమను ప్రదర్శిస్తోందని ఆరోపించింది.
Posted by
Hollywood Actors
0 comments:
Post a Comment