Sunday, July 19, 2009
at
4:43 AM
|
నిన్న నేను చెప్పినట్టుగా పిచ్చి ట్రాఫిక్ ఏ కాదు ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు శిలపాలు ఇంకా ఎన్నో ఉన్నాయ్ అల్లంటివి అన్ని చూడలంటే మనకి కళ్లు చాలవు భినత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో ఎన్నో అందాలు అందులో ఇది ఒకటి
ఎల్లోరా, అజంతా అనగానే అక్కడి గుహాలయూల్లోని గోడ చిత్రాలు మన మనోనేత్రాల ముందు కదలాడుతాయి. సరే, కఠినమైన శిలలనుంచి ఈ గుహాలయూలను ఎలా నిర్మించారా అని మీరెప్పు డైనా ఆలోచించారా? మీలో చాలామంది సముద్ర తీరాలకు వెళ్ళి ఉంటారు. అలా వెళ్ళినప్పుడు సముద్ర కెరటాలను తాకేలా పాదాలను ఉంచడం ఉవ్వెత్తున అలలు వచ్చేప్పుడు తీరం కేసి పరిగెత్తడం ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం మొదలైనవి పిల్లలకు ఉత్సాహం కలిగించే విషయూలు. అలా ఇళ్ళు కట్టేప్పుడు ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా ఏ వస్తువునోగాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వార మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయూలను నిర్మించారు. మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభ మయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరవాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగా నికి వచ్చేవారు. ముంబై సమీపంలోని కార్లే గుహా లయం 1,900 సంవత్సరాలకు పూర్వమే నిర్మించ బడింది. ఇరువైపులా ఒకే సరళరేఖపై వున్న స్తంభాలకు అది ప్రసిద్ధిగాంచింది. దానిని నిర్మించిన శిల్పుల నైపుణ్యం అనన్య సామాన్యమైనది; ప్రతిభ పరిపూర్ణమైనది. ఎల్లోరా గుహలో కైలాస మందిరాన్ని రూపొందించిన శిల్పి, అలాంటి అద్భుతమైన కళాసృష్టి తన ఆధ్వర్యంలో జరిగిందని తనే విశ్వసించలేకపోయూడట!
Posted by
Hollywood Actors
Labels:
[Great Temples]
0 comments:
Post a Comment