తెలుగునాట బ్రహ్మంగారి గురించి కానీ ఆయన కాలజ్ఞానం గురించి కాని తెలియని వారు లేరనే చెప్పాలి. ఆయన భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ఆయన ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్గ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాయంగా ప్రజల విశ్వాసం. ఆయన తన సమాధి తిరిగి తెరవబడుతుందని ఒక ఫలకం మీద వ్రాసి ఆఫలకంలో కాలనిర్ణయం చేయబడింది. ఖచ్చితంగా అదే రోజు సమాధి తెరవబడటం విశేషం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు. బ్రహ్మంగారు ఆంద్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ మరియు మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక మరియు రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. ఆయన తన 175వ ఏట జీవసమాధి చెందారు. ఆయన తన కుమారునితో చేసిన సమాధి ప్రస్థావనలో తన వయసు సూచించారు. జీవ సమాధి చెందిన తరవాత ఆయన ప్రియ శిష్యుని దు॰ఖం నివారణ నిమిత్తం తిరిగి కనిపించి శిష్యునికి కమండలం, దండం, పాదుకలు మరియు ఉంగరం బహూకరించాడు
ఇప్పటి వరకు జరిగినవి
నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి)
ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాయమేలుతుంది. (ఇందిరా గాంథి)
తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (చలన చిత్రాలు) రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి.
ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
హైదరాబాదులు తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు) దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.
గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.
కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజంతా మోసపోతారు
Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates