దక్షిణాఫ్రికాలో దుండగుల దాడిలో మరణించినాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కిరణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కిరణ్ మృతదేహాన్ని రాష్ట్రానికి తెప్పించేందుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఈ మాత్రంతో చేతులు ముడుచుకొని కుర్చుంటే అంతే సంగతులు దుండగులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ గాయపడి ఆ తర్వాత ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. కిరణ్ మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కిరణ్ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిరణ్ మృతదేహాన్ని రాష్ట్రానికి తెప్పించేందుకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కూడా ఆయన కోరారు. విదేశాల్లోని తెలుగు విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని ఆయన కోరారు.చుశారుగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్ల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉరుకోవడం గాక దక్షిణాఫ్రిక ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇదెదో అన్ని దేశాలు పగబట్టి ఇండియా మీద పడినట్టు ఉంది ఇక్కడ యువకులంత విదేశాలకు వెళ్ళలంటే భయపడే స్తితికి తీసుకొచ్చేటట్టు ఉన్నాయి విదేశాలు ఇక నైన మన ప్రభుత్వలు మేలుకొంటే బాగుంటుంది



Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates