బ్రిటన్‌లోని ఈస్ట్ ససెక్స్ చర్చ్ జీన్స్ వేషం ధరించి ఉన్న జీసస్ క్రైస్త్ కంచుపతకాన్ని ఆవిష్కరించింది. ఇంతవరకు జీసస్ ప్రపంచమంతటా 2 వేల ఏళ్ల నాటి సాంప్రదాయిక దుస్తులతోనే కనపడుతుండగా నేటి జీసస్‌ను 21వ శతాబ్ది క్రీస్తుగా చూపించాలనే ఉద్దేశంతో ససెక్స్ చర్చ్ ఈ నిర్ణయం తీసుకుంది.
జీసస్‌ను బ్యాగీ జీన్స్‌లో ఉన్నట్లుగా చూపిస్తున్న ఈ కంచు విగ్రహాన్ని చూసేందుకు జనం విరగబడుతున్నారు. ఏడడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం తయారీకి 35 వేల పౌండ్లు వెచ్చించారు.
జీన్స్, షర్టు ధరించి ఉన్న జీసస్ చర్చి గోడమీద గాలికి ఊగులాడుతున్నట్లుగా ఈ విగ్రహం రూపొందించారు. కాగా, జీసస్ జుత్తు, గడ్డాన్ని కూడా ఫ్యాషన్‌గా కత్తిరించి వేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఫాదర్ బర్క్‌లీ మాట్లాడుతూ క్రిస్టియానిటీ అనుభవాలతో ప్రజలను మేల్కొల్పడానికి నేటికాలంలో కొత్త పద్ధతులను అవలంబించవలసిందేదనని ముక్తాయించారు.
సద్బుద్ధి కలవారు జీసస్ కొత్త రూపాన్ని అభినందిస్తారని ఫాదర్ చెప్పారు. యూరప్ వ్యాప్తంగా జీసస్ అధునాతర రూపాలను ఇప్పటికే ప్రజలు చూస్తున్నారని, అయితే ససెక్స్ ప్రాంతంలో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదని అన్నారు. బాధలకు ప్రతి రూపంలా కాకుండా చురుగ్గా, క్రియాశీలంగా ఉండే జీసస్‌ను ప్రదర్శించాలనే భావంతో తాము జీసస్‌కు కొత్త వేషం డిజైన్ తెలిపారు.
అభిప్రాయాన్ని 200 మంది సభ్యులు బలపర్చగా, 14మంది మాత్రమే వ్యతిరేకించారు
0 comments:
Post a Comment