Monday, July 27, 2009
at
1:23 AM
|
తారెగ్న.. కేవలం 683 మంది జనాభా కలిగిన ఊరు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఓ సాధారణ గ్రామం. సంపూర్ణ సూర్యగ్రహణం ఘటన జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ చిన్ని గ్రామం అంతర్జాతీయ ప్రచారాఒ పొందుతుంది . కారణం.. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకు ఈ గ్రామంతో ఉన్న సంబంధమే. క్రీ.శ 6వ శతాబ్దంలో ఆర్యభట్ట ఈ గ్రామంలోనే వేధశాలను ఏర్పర్చాడు.నక్షత్రాల గమనాన్ని పరిశీలించడంలో జీవిత పర్యంతం కృషి చేసిన ఆర్యభట్ట ఇప్పుడు యావత్ ప్రపంచమూ విశ్వసిస్తున్న సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చరిత్రలో మొదటిసారిగా ప్రతిపాదించినట్లుగా భావిస్తున్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అంతవరకూ ప్రపంచం నమ్ముతూ వచ్చిన భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆర్యభట్ట తోసిపుచ్చి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని ప్రకటించాడు.
వేల సంవత్సరాల క్రితం ప్రముఖ భారత అంతరిక్ష శాస్తవ్రేత్త ఆర్యభట్ట నక్షత్ర గమనాలను, గ్రహస్థితులను అధ్యయనం చేసిన తారెగ్నా గ్రామం చాలా ఏళ్ల అనంతరం అంతరిక్ష యాత్రికులతో సందడిగా మారింది.ఈ నెల 22 న వచ్చిన సుదీర్ఘ సంపూర్ణ సూర్య గ్రమణాన్ని దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గ్రామాన్ని చేరుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం ఖగోళ పరిశోధనలకు చక్కగాసరిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి తారెగ్న అనువైన స్థలమని నాసా శాస్తజ్ఞ్రులు పేర్కొన్నారు.అందుకే అందరూ అన్ని దేశాలనుండి గ్రామాన్ని చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఖగోళంలో జరిగే వింతలను, వీక్షించడానికి, వాటపై పరిశోధనలు జరిపేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఈ గ్రామనికి వచ్చారు. ‘తారె- అనగా నక్షత్రాలు. గిననా- అంటే లెక్కించడం.’ నక్షత్రాలను లెక్కించడం. అందువల్లే ఈ గ్రామానికి ‘తారెగ్న’ అనే పేరువచ్చిందని స్థానికులు భావిస్తారు. సముద్ర మట్టానికి కేవలం 61 మీటర్ల ఎత్తున్న తారెగ్నా గ్రామానికి ఉన్నట్లుండి సందర్శకుల సందడి పెరిగింది. జూలై 22 బుధవారం ఏర్పడిన సూర్యగ్రహణ విశేషాలను గమనించడానికి వేలాదిమంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, వీక్షకులూ ఈ గ్రామానికిచేరుకున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అత్యంత స్పష్టంగా దర్శించగల అతి కొ్ద్ది ప్రాంతాల్లో తారెగ్నా ఒకటని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించడంతో ఈ గ్రామం ఒక్కసారిగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. భారత దేశంలో చెప్పుకొదగ్గ వీక్షించదగిన ప్రాంతాలలో తారెగ్నా ఒకటి అది కొద్ది రోజులు వెనక్కి వెళ్లిపోయిన ఇప్పుడు వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంతో మళ్ళీ అమెరికా అంతరిక్ష పరిశోదనా కేంద్రం దాక వెళ్ళిపోయింది
Posted by
Hollywood Actors
0 comments:
Post a Comment